Hyderabad, సెప్టెంబర్ 19 -- గ్రహాలు కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. విలాసాలకు అధిపతి అయినటువంటి శుక్రుడు, సొంత రాశి వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు, కుజుడితో సంయోగం చెందుతాడు. ఈ రెండు ప్రధాన గ్రహాలు ధన శక్తి రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి.

ఈ యోగం కారణంగా ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది, కానీ కొన్ని రాశుల వారు మాత్రం శుభ ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన ఈ రాజయోగం ఉంటుంది. వృశ్చిక రాశిలోకి శుక్రుడు నవంబర్ 26న ప్రవేశిస్తాడు. కుజుడు అప్పటికే వృశ్చిక రాశిలో ఉంటాడు.

నవంబర్ 26వ తేదీన మొదలై ఈ రాజయోగం డిసెంబర్ 7 వరకు ఉంటుంది. ఈ ధన శక్తి రాజయోగం వలన ఏ రాశుల వారు ప్రయోజనాన్ని పొందుతారు, ఎవరికి ఎలాంటి లాభాలు ఉం...