Hyderabad, సెప్టెంబర్ 22 -- సనాతన ధర్మ సంప్రదాయంలో శక్తి ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ శక్తి రూపాల్లో అత్యంత పవిత్రం.. శ్రీ బాలా త్రిపురసుందరి దేవి. అమ్మవారు శ్రీ విద్యా ఉపాసనలో బాలరూపిణి తల్లి స్వరూపంగా, విశ్వాన్ని కాపాడే కరుణామయి శక్తిగా ఆరాధించబడుతున్నారు.

బాలా త్రిపురసుందరి దేవి చిన్న వయసులోనూ సర్వజ్ఞత, సర్వశక్తులను కలిగి ఉన్న దివ్యరూపిణి. అమ్మవారి రూపం బాలిక వలె సుందరంగా ఉండటమే కాక, ఆ రూపంలో అంతులేని దైవ గాంభీర్యం నిక్షిప్తమై ఉంటుంది. "త్రిపురసుందరి" అనే పదమే మూడు లోకాలను తన సౌందర్యం, శక్తి, కరుణతో ఆకర్షించే తల్లిని సూచిస్తుంది. భక్తుల జీవితంలో సౌఖ్యం, ఐశ్వర్యం, జ్ఞానం ప్రసాదించడమే ఈ అమ్మవారి అవతారం యొక్క లక్ష్యం. ప్రత్యేకంగా బాలరూపంలో దర్శనమివ్వడం ద్వారా నిర్దోషత్వం, పావిత్ర్యం, సులభ సాంద్రతను మానవాళికి బోధిస్తుందని పురాణాలు చెబు...