భారతదేశం, నవంబర్ 7 -- ఈటీవీ విన్ ఓటీటీలో వచ్చిన #90's వెబ్ సిరీస్ లో సాంప్రదాయిని సుప్పిని అంటూ ఆదిత్య పాత్రలో నటించిన రోహన్ రాయ్ గుర్తున్నాడు. ఇప్పుడు అతడు తొడగొట్టి మరీ విజయ్ దేవరకొండకు సవాలు విసిరాడు. దీనికి రౌడీ బాయ్ కూడా ఎక్స్ వేదికగా రియాక్ట్ కావడం విశేషం. నీకు ఏది కావాలంటే అది ఇస్తానని అన్నాడు.

ఈటీవీ విన్ ఓటీటీలో వచ్చిన ఆ #90's వెబ్ సిరీస్ తో ప్రతి తెలుగు వారి ఇంట్లో ప్రత్యేక స్థానం సంపాదించిన చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్. తాజాగా అతడు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే మూవీలో నటించాడు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా అతడు మాట్లాడాడు.

అప్పుడే అతడు తొడగొట్టి.. విజయ్ దేవరకొండన్నా.. టీజర్ రిలీజ్ అప్పుడు కూడా చెప్పాను.. నా సైజు ఎస్.. మా మొత్తం టీమ్ కు రౌడీ షర్టులు రెడీగా పెట్టుకో అని అతడు అన్నాడు. ఈ వీడియో తెగ వైరల్ అయింది. దీనిని చూసి...