భారతదేశం, డిసెంబర్ 22 -- ఇండియాలో తెలుగు హీరోల డామినెన్స్ కొనసాగుతోంది. ఓ వైపు తెలుగు సినిమాలు ఇండియన్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్నాయి. మరోవైపు టాలీవుడ్ హీరోలు క్రేజ్ పరంగా మిగతా ఇండస్ట్రీల కథానాయకులను వెనక్కి నెడుతున్నారు. ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసిన నవంబర్ 2025 ఇండియా టాప్ 10 హీరోల లిస్ట్ లో ప్రభాస్ నంబర్ వన్ ప్లేస్ లో నిలిచాడు.

బాహుబలి సినిమాలతో తిరుగులేని క్రేజ్ దక్కించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన హీరోగా టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. నవంబర్ నెలకు గాను అతనిదే నంబర్ వన్ స్థానం. సలార్, కల్కి లాంటి మూవీస్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. 2026 సంక్రాంతికి రాజాసాబ్ అంటూ థియేటర్లకు రాబోతున్నాడు.

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ తన చ...