Hyderabad, అక్టోబర్ 6 -- హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ప్రియదర్శి. హీరోగా ప్రియదర్శి నటించిన లేటెస్ట్ కామెడీ సినిమా మిత్ర మండలి. సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ నిహారిక ఎన్ఎమ్ హీరోయిన్‌గా ఈ సినిమాలో నటించింది.

బివి వర్క్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌లపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ఇతర కీలక పాత్రలు పోషించారు.

అక్టోబర్ 16న మిత్ర మండలి సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే మిత్ర మండలి చిత్ర బృందం విజయవాడ ఉత్సవ్ ఈవెంట్‌‌లో సందడి చేసింది. దసరా సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హీరో ప్రియదర్శితోపాటు పలువురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ...