భారతదేశం, నవంబర్ 4 -- బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి సోనాక్షి సిన్హా ఇప్పుడు తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెడుతోంది. అభిషేక్ జైస్వాల్, వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'జటాధర'తో ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో సుధీర్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తుండగా, శిల్పా శిరోద్కర్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుంది. 'దబంగ్', 'లూటేరా', 'అకీరా' వంటి సినిమాలతో గుర్తింపు పొందిన సోనాక్షి సిన్హా.. ఈ బైలింగ్వల్ మూవీలో 'ధనపిశాచిని' అనే ప్రతినాయక పాత్రను పోషిస్తుండటం విశేషం. ఈ సినిమా నవంబర్ 7న విడుదల కానుంది.

తన తెలుగు అరంగేట్రం గురించి సోనాక్షి సిన్హా పీటీఐతో మాట్లాడింది. "కథ నన్ను బాగా ఆకర్షించింది. ఇది చాలా డార్క్, లేయర్‌డ్‌గా ఉంది. నేను ఇంతకుముందు చేసిన సినిమాల కంటే ఇది చాలా భిన్నంగా ఉంది" అని తన అనుభవాన్ని పం...