భారతదేశం, డిసెంబర్ 24 -- ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. కేవలం హిందీలోనే విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్ల మైలురాయిని దాటింది. సౌత్ ఇండియాలో ఈ సినిమాకు వచ్చిన ఆదరణ చూసి, దీని సీక్వెల్ 'ధురంధర్ 2'ను తెలుగుతో సహా అన్ని దక్షిణాది భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

డిసెంబర్ 5న విడుదలైన 'ధురంధర్' (Dhurandhar) సినిమాతో రణ్‌వీర్ సింగ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రిలీజ్ అయినా ఇండియాలో రూ. 600 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

మొదటి పార్ట్ క్లైమాక్స్‌లో సీక్వెల్ గురించి అనౌన్స్ చేశారు. అంతేకాదు రంజాన్ సమయంలో అంటే వచ్చే...