Hyderabad, ఆగస్టు 1 -- ఓటీటీలోకి మరో తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. శ్రీకాకుళానికి చెందిన జాలర్లు అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లడం, పాక్ నేవీ వాళ్లను అరెస్ట్ చేయడం అనే కథతో ఈ సిరీస్ వస్తోంది. ఇది వినగానే మీకు ఏదైనా గుర్తుకు వస్తోందా? అవును నాగ చైతన్య నటించిన తండేల్ మూవీ స్టోరీలాగే అనిపించే అరేబియా కడలి వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో రాబోతోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో అందిస్తున్న మరో తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ అరేబియా కడలి. కొన్ని రోజుల కిందట ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన ఆ ఓటీటీ తాజాగా శుక్రవారం (ఆగస్ట్ 1) ట్రైలర్ తీసుకొచ్చింది. ఈ ట్రైలర్ చూడగానే చాలా మందికి తండేల్ మూవీ స్టోరీలాగే అనిపించింది. ఈ సిరీస్ లో సత్యదేవ్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు.

శ్రీకాకుళానికి చెందని జాలర్లు పాకిస్థాన్ జలాల్ల...