భారతదేశం, డిసెంబర్ 11 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ గత కొన్ని రోజులుగా ఆసక్తికర మలుపులతో సాగుతూ ప్రేక్షకులకు అలరిస్తోంది. దీంతో ఈ సీరియల్ 48వ వారం టీఆర్పీ రేటింగ్స్ లో మరోసారి టాప్ 3లోకి దూసుకొచ్చింది. ఇక టాప్ 10లో ఆరు స్టార్ మా సీరియల్స్ ఉండగా.. చివరి నాలుగు స్థానాల్లో జీ తెలుగు సీరియల్స్ కొనసాగుతున్నాయి.

తెలుగు టీవీ సీరియల్స్ కు సంబంధించి గురువారం (డిసెంబర్ 11) 48వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. వీటిలో మరోసారి కార్తీక దీపం 2 సీరియల్ ఎవరికీ అందనంత ఎత్తులో నంబర్ 1గా నిలిచింది. ఈవారం ఈ సీరియల్ కు 15.72 రేటింగ్ నమోదు కావడం విశేషం. ఇక రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు కొనసాగుతోంది. ఈవారం ఈ సీరియల్ కు 14.95 రేటింగ్ వచ్చింది.

కొన్నాళ్లుగా ఆసక్తికర మలుపులతో అలరిస్తున్న గుండె నిండా గుడి గంటలు అర్బన్ మార్కెట్ లో నంబర్ 1గా నిలవడం విశేషం....