Hyderabad, ఆగస్టు 14 -- స్టార్ మాతోపాటు జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ ప్రతి వారం మారుతూ ఉండే విషయం తెలిసిందే. తాజాగా ఈ ఏడాది 31వ వారం రేటింగ్స్ గురువారం (ఆగస్టు 14) రిలీజయ్యాయి. ఈవారం కూడా స్టార్ మా సీరియల్ కార్తీకదీపం 2 టాప్ లో నిలిచింది. టాప్ 10లో ఉన్న మిగిలిన సీరియల్స్ ఏవో చూడండి.

స్టార్ మా సీరియల్స్ టాప్ 10లో మొత్తం ఏడు చోటు సంపాదించాయి. తొలి స్థానంలో కార్తీకదీపం 2 ఉంది. గత వారంతో పోలిస్తే కాస్త రేటింగ్ తగ్గినా.. టాప్ లోనే ఉంది. ఈవారం 14.45 రేటింగ్ సాధించింది. ఇక రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 13.35 రేటింగ్ తో ఉంది. మూడో స్థానంలో ఉన్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ 12.09 రేటింగ్ సాధించింది. ఇంటింటి రామాయణం సీరియల్ 11.45తో నాలుగో స్థానంలో నిలిచింది.

గత వారం కోల్పోయిన తన ఐదో స్థానాన్ని చిన్ని మళ్లీ దక్కించుకుంది....