భారతదేశం, నవంబర్ 4 -- తెలుగులో ఈ మధ్యే వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రముఖ నటి వర్ష బొల్లమ్మ లీడ్ రోల్లో నటించిన సిరీస్ ఇది. ఇప్పుడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ ను ఈటీవీ విన్ ఓటీటీ అనౌన్స్ చేసింది. తమ కథను కానీ కొట్టారంటూ మరో ఓటీటీలోని వెబ్ సిరీస్ పై ఆరోపణల ద్వారా ప్రముఖంగా వార్తల్లో నిలిచిన ఈ సిరీస్ నుంచి రెండో సీజన్ వస్తుండటం ఆసక్తి రేపుతోంది.

ఈటీవీ విన్ ఓటీటీ నుంచి వచ్చిన హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం నుంచి రెండో సీజన్ వస్తోంది. వచ్చే నెలలోనే దీనిని తీసుకురానున్నట్లు మంగళవారం (నవంబర్ 4) సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. "మీరు మళ్లీ చూస్తున్నారు. మేము మిమ్మల్ని చూస్తున్నాం. కనకం వచ్చే నెలలో డబుల్ ఫైర్ తో మళ్లీ వస్తోంది. సిద్ధంగా ఉండండి" అనే క్యాప్షన్ తో ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

ఆ పోస్టర్...