Hyderabad, ఆగస్టు 8 -- తెలుగు కామెడీ మూవీ కొత్తపల్లిలో ఒకప్పుడు ఓటీటీ రిలీజ్ కన్ఫమ్ అయింది. గత నెల 18న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. రానా దగ్గుబాటి సమర్పించిన ఈ సినిమాకు ఐఎండీబీలోనూ 8.2 రేటింగ్ ఉండటం విశేషం. గడ్డివాము దగ్గర కథ అడ్డం తిరిగే ఈ సినిమాను ఆహా వీడియో స్ట్రీమింగ్ చేయనుంది.

కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ ఆగస్టు 22 నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ శుక్రవారం (ఆగస్టు 8) తన ఎక్స్ అకౌంట్ ద్వరాా వెల్లడించింది. "కొత్తపల్లి పిలుస్తోంది.. కొత్తపల్లిలో ఒకప్పుడు ఆగస్టు 22 నుంచి కేవలం ఆహాలో ప్రీమియర్ కానుంది.

గోల్డ్ యూజర్స్ కు 24 గంటలకు ముందే యాక్సెస్ లభిస్తుంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. జులై 18న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. నెల రోజులు పూర్తవగానే డిజిటల్ ప్రీమియ...