Hyderabad, అక్టోబర్ 7 -- తెలుగులో ఇప్పటికే జాతి రత్నాలు, మ్యాడ్ మూవీస్ ఎంతటి సంచలన విజయం సాధించాయో మనకు తెలుసు. ఆ రెండు సినిమాలను గుర్తుకు తెచ్చేలా ఇప్పుడు మిత్ర మండలి పేరుతో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ మంగళవారం (అక్టోబర్ 7) రిలీజైంది.

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బన్నీ వాస్ సమర్పణలో ఈ మిత్ర మండలి మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రియదర్శితోపాటు ప్రసాద్ బెహరా, విష్ణు, మయూర్, వెన్నెల కిశోర్, సత్యలాంటి వాళ్లు నటించారు. ఈ మూవీ ట్రైలర్ ఊహించినట్లే కడుపుబ్బా నవ్వించేలా సాగింది. ఈ ట్రైలర్ మొదట్లోనే సినిమాలోనే లీడ్ పాత్రలను పరిచయం చేశారు.

అది గాలికి తిరిగే బ్యాచ్ అని చూడగానే అర్థమవుతుంది. ఆ ముగ్గురూ ఓ అమ్మాయి వెంట పడటం, అందులో భాగంగా జరిగే ఫన్నీ హింస, గందరగోళం మధ్య ఈ మిత్ర మండలి ట్రైలర్ సాగిపోయింది. రెండు నిమిషాల 40 సెకన్...