Hyderabad, ఆగస్టు 19 -- సముద్రాల సినీ క్రియేషన్స్ బ్యానర్ మీద తెరకెక్కిన సినిమా లవ్ యూరా. ఈ సినిమాలో చిన్ను హీరోగా, గీతికా రతన్ హీరోయిన్‌గా చేశారు. సముద్రాల మంత్రయ్య బాబు, కొన్నిపాటి శ్రీనాథ్ ప్రజాపతి నిర్మాతలుగా రూపొందించిన ఈ సినిమాకు ప్రసాద్ ఏలూరి దర్శకత్వం వహించారు.

లవ్ యూ రా సినిమాను సెప్టెంబర్ 5న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో లవ్ యూ రా ఆడియో లాంచ్ ఈవెంట్‌ను సోమవారం (ఆగస్ట్ 18) నాడు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో 'ఏ మాయ చేశావే పిల్లా', 'వాట్సప్ బేబీ', 'యూత్ అబ్బా మేము', 'దైవాన్నే అడగాలా' అనే పాటలను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో దర్శకనిర్మాతలు, హీరో, హీరోయిన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

హీరో చిన్ను మాట్లాడుతూ .. "లవ్ యూ రా నాకు మొదటి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. ఈ ప్రయాణంలో మా వె...