Hyderabad, జూలై 13 -- ఇటీవల కాలంలో ఇతర భాషల్లో సూపర్ హిట్ లేదా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ ట్రెండ్‌లో భాగంగా ఇప్పుడు తాజాగా మరో కొత్త పరభాష చిత్రం తెలుగులోకి వచ్చేయనుంది. ఆ సినిమానే డీఎన్ఏ.

తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన డీఎన్ఏ తెలుగులో విడుదల కానుంది. కోలీవుడ్‌లో క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో డీఎన్ఏ తెరకెక్కింది. ఈ సినిమాను తెలుగులో మై బేబీ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇటీవల మై బేబీ సినిమా తెలుగులో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీంతో రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్.

మై బేబీ సినిమా ఈ ఏడాది జులై 18న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్‌మాల్‌, పిజ్జా వంటి విజయవంతమైన అనువాద చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సురేష్ కొండేటి ఈ 'మై బేబి' మ...