భారతదేశం, డిసెంబర్ 18 -- తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (TSCAB) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా పలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులలో (DCCBs) కో-ఆపరేటివ్ ఇంటర్న్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 7 ఖాళీలున్నాయి.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఆదిలాబాద్ డీసీసీబీలో ఒక పోస్టును, ఖమ్మం డీసీసీబీ -1 పోస్టు, కరీంనగర్ డీసీసీబీ -1, మహబూబ్ నగర్ - 01, నల్గొండ- 01, నిజామాబాద్ డీసీసీబీ 01, వరంగల్ డీసీసీబీలో ఒక పోస్టును రిక్రూట్ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....