Hyderabad, Oct. 26 -- మెుంథా తుపాను ప్రభావంతో అక్టోబర్ 28, 29 తేదీల్లో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తెలంగాణ అంతటా దీని ప్రభావం ఉండనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అక్టోబర్ 28 ఉదయం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరాన్ని దాటుతుందని, గంటకు 90–110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా.

తుపాను తీరానికి చేరుకోవడంతో కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో 150-220 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఇది ఆకస్మిక వరదలకు దారితీసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

సోమవారం ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, ములు...