భారతదేశం, ఏప్రిల్ 14 -- రాష్ట్రంలో వేసవి తాపం మొదలైంది. ఏప్రిల్ రెండో వారంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రానున్న మూడు రోజుల పాటు (ఏప్రిల్ 16 వరకు) ఉష్ణోగ్రతలు 41 నుండి 45 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలోని 22 ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల మార్కును దాటేశాయి. తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) గణాంకాల ప్రకారం, సోమవారం సాయంత్రం 5 గంటల సమయానికి నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం మాచెర్ల గ్రామంలో అత్యధికంగా 43.2degC ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన జిల్లాల పరిస్థితి చూస్తే:

హైదరాబాద్: నగరంలో కాస్త తక్కువగా 40.9degC నమోదైనప్పటికీ, రానున్న రోజు...