భారతదేశం, మే 31 -- రాశి చక్రంలో ఏడవదైన తులా రాశి వారికి ఈ కొత్త వారం అనేక హెచ్చుతగ్గులతో కూడి ఉంటుంది. వారం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా, మధ్య కాలానికి వచ్చేసరికి పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రేమ జీవితంలో సంతోషకరమైన క్షణాలు ఉన్నప్పటికీ, మీ మాట తీరు వల్ల బంధంలో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది.

తులా రాశి వారికి ఈ వారం ప్రేమ వ్యవహారాలు సాధారణంగా సాగుతాయి. పంచమాధిపతి ఆరవ ఇంట్లో సంచరిస్తుండటం వల్ల లవ్ లైఫ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. భాగస్వామితో సంబంధాలు కాస్త మందగించినట్లు అనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఎక్కడ లోపం జరుగుతుందో గుర్తించి సరిదిద్దుకోవాలి. ఈ వారం వీలైనంత వరకు తక్కువ మాట్లాడటం శ్రేయస్కరం. మీ నోటి దురుసుతనం వల్లే బంధ...