భారతదేశం, నవంబర్ 10 -- ప్రతి ఒక్కరూ కూడా వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లో ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవుతుంది. అయితే వాస్తు ప్రకారం ఇంట్లో మొక్కలనూ కూడా పెడుతూ ఉంటారు. సరైన దిశలో మొక్కలు ఉంటే మంచి జరుగుతుందని, సానుకూల మార్పులను చూడొచ్చని నమ్ముతారు. అయితే ఇంట్లో తులసి మొక్క పెట్టేటప్పుడు చాలా మందిలో సందేహం ఉంటుంది. వాస్తు ప్రకారం తులసి మొక్కను ఏ దిశలో పెట్టాలి అని పండితులను అడుగుతూ ఉంటారు.

హిందువులకు తులసి మొక్క చాలా ముఖ్యమైనది, పూజ్యమైనది, పవిత్రమైనది. తులసి మొక్కని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి. తులసి మొక్క ముందు దీపారాధన చేసి తులసికి పూజ చేస్తే డబ్బుకి లోటు ఉండదు. తులసిని లక్ష్మీదేవిగా భావిస్తారు. విష్ణువు తులసి ప్రియుడు. విష్ణువుకి తులసిదలాలని సమర్పిస్తే అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇంత ప్రాముఖ్యత ...