భారతదేశం, నవంబర్ 7 -- తిరుమల శ్రీవారి భక్తులకు కీలక అప్డేట్ వచ్చేసింది. శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇందుకోసం ఆఫ్‌లైన్‌, ఆన్ లైన్ టోకెన్ల జారీ విధి విధానాలు త్వరలో తెలియజేస్తామన్నారు.

శ‌నివారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో.. 17 మంది భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. శ్రీవారి భక్తుల విజ్ఞప్తి మేరకు అంగప్రదక్షిణ టోకెన్ల జారీని డిప్‌ విధానం నుంచి మార్చినట్లు వివరించారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆన్‌లైన్‌ కోటా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

తిరుప‌తిలో రోజుకు 20 వేల సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయని ఈవో తెలిపారు. ఆన్ లైన్ లో క...