భారతదేశం, జనవరి 30 -- తిరుమల కల్తీ లడ్డూ వివాదంపై సీబీఐ ఇచ్చిన నివేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వానికి వైసీపీ సూటిగా ప్రశ్నలు సంధిస్తోంది. శ్రీవారి లడ్డూ కేంద్రంగా తప్పుడు చేశారని. కానీ సీబీఐ నివేదిక ద్వారా అసలు విషయాలు బయటికొచ్చాయని చెబుతోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ నేతలు ప్రస్తావిస్తూ. కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఇదే విషయంపై వైసీపీ ముఖ్య నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం చేపట్టారు. తిరుపతిలోని ఆయన నివాసం వద్దే హోమం కార్యక్రమం జరుగుతోంది. 'సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తీవ్రమైన అపనింద మోపారని.. హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామిపై రాజకీయ ఆరోపణలు చేశారని భూమన ఆరోపించారు.

ఆవు కొవ్వుతో లడ్డు ప్రసాదం తయారు చేశారు అని విష ప్రచారం చ...