భారతదేశం, ఫిబ్రవరి 12 -- తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల‌హారం శోభాయాత్ర గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి వైభవంగా ప్రారంభమైంది. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. టీటీడీ స్థానిక ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి గరుడసేవ రోజు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించేందుకు ఊరేగింపుగా తీసుకెళుతున్నట్టు తెలిపారు.

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వాహన సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ సందర్భంగా టీటీడీ నుంచి దాదాపు ర...