భారతదేశం, నవంబర్ 15 -- తిరుమల శ్రీవారిని ప్రతినిత్యం వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. అంతే సంఖ్యలో విరాళాలు అందుతాయి. ఇటీవలే కాలంలో విరాళాలు ఇచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. వీరిలో కొంతమంది భక్తులు బంగారం, వెండి వంటివి ఇస్తే. మరికొందరు డబ్బులు అందజేస్తున్నారు. తాజాగా తిరుమల శ్రీవారికి ఓ కంపెనీ ఎలక్ట్రిక్ బస్సును అందజేశారు. ఈ మేరకు టీటీడీ వివరాలను పేర్కొంది.

"పూణేకు చెందిన పినాకిల్ మొబిలిటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.74.24 లక్షల విలువైన విద్యుత్‌ బస్సును శనివారం విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ఎదుట బస్సు తాళాలను డిప్యూటీ ఈవో లోకనాథంకు అందజేశారు" అని టీటీడీ పేర్కొంది.

విజయవాడకు చెందిన శ్రీ మోనిష్ వెంకట సత్య ప్రకాష్ అనే భక్తుడు భారీ విరాళాన్ని ప్రకటించారు. శుక్రవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన...