భారతదేశం, నవంబర్ 9 -- తిరుమలోని కళ్యాణకట్ట, లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అధికారులకు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేర‌కు భ‌క్తుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు మ‌రింత మెరుగైన స‌క‌ర్యాలు క‌ల్పించేందుకు టీటీడీ అభిప్రాయ సేక‌ర‌ణపై ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. ఐవీఆర్ఎస్, వాట్సాప్‌, శ్రీ‌వారి సేవ‌కుల ద్వారా భ‌క్తుల నుండి క్ర‌మంగా అభిప్రాయాల‌ను సేక‌రించ‌డం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో టీటీడీ అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో శ‌నివారం సమీక్ష నిర్వహించారు. భ‌క్తుల నుండి అక్టోబ‌ర్ నెల‌లో సేక‌రించిన అభిప్రాయాల‌పై విభాగాల వారీగా చర్చించారు. వీటి ఆధారంగా పలు ఆదేశాలను జారీ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న అభిప్రాయాల‌పై అధికారుల‌తో చ‌ర్చి...