భారతదేశం, ఫిబ్రవరి 7 -- టీటీడీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా హాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ ను నిర్వహించనున్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, కపిలతీర్థం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలలో ఈ కార్యక్రమం ఉండనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ ను సాయంత్రం 06 గం.ల నుంచి అర్థరాత్రి 12 గం.ల వరకు నిర్విరామంగా నిర్వహిస్తారు. ఇందులో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ సందర్భంగా హెచ్ డి పి పి, ఎస్వీ సంగీత నృత్య కళాశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పూర్వ కాలంలో మహాశివరాత్రి సందర్భంగా సనాతన హిందూ ధర్మ సంప్రదాయంలో భాగంగా భక్తులు ఆలయాలకు చేరుకుని రాత్రంతా భజనలు, హరికథలు తదితర భక...