భారతదేశం, జనవరి 2 -- తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. భక్తులను జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ అదనపు వెంకయ్య చౌదరి వెల్లడించారు.

తిరుమలలోని క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లను శుక్రవారం ఉదయం అదనపు ఈవో అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆదనపు ఈవో మాట్లాడుతూ. వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు నాలుగో రోజైన శుక్రవారం నుండి 8వ తేదీ వరకు పూర్తిగా సర్వదర్శనానికి కేటాయించినట్లు తెలిపారు.

జనవరి 1వ తేదీ సాయంత్రం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారని, జనవరి 1వ తేదీ రాత్రి నుండి సర్వదర్శనం భక్తులను వైకుంఠ ద్వార దర్శనాన...