భారతదేశం, సెప్టెంబర్ 10 -- కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కొండపైన ఎటు చూసినా భక్తుల సందడే కనిపిస్తోంది. ప్రస్తుతం తిరుమలలో ప్రశాంత వాతావరణానికి తోడు భక్తుల రాక అనూహ్యంగా పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, క్యూలైన్లు అన్నీ నిండిపోయాయి. ప్రస్తుతం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు స్వామివారి మూలవిరాట్ దర్శనం లభించడానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది.

ఈ నెలాఖరులో వరుస సెలవులు రావడం భక్తుల రద్దీకి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ నెల 12వ తేదీ శనివారం నుంచి 14వ తేదీ సోమవారం వరకు వరుసగా సెలవులు రానున్నాయి. దీనితో వీకెండ్ కలసి రావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రానున్న రెండు, మూడు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అంచనా వేస్తున్...