తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు : ఈనెల 22న అంకురార్పణ - విశేషాలివే..!
భారతదేశం, మే 21 -- Tirupati Govindaraja Swamy Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుపతి నగర నడిబొడ్డున వెలసిన చారిత్రక ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం. శిల్పకళ, భక్తి, ఆగమ సంప్రదాయాల సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాల సంబరం మొదలుకానుంది. మే 23 నుండి 31వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలకు మే 22న శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 22వ తేదీ సాయంత్రం 5.30 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య ఈ అంకురార్పణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరగనుంది.
బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు రోజున నిర్వహించే అంకురార్పణకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మే 22న ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.