తిరుపతి : మార్మోగిన గోవింద నామస్మరణ - వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి రథోత్సవం
భారతదేశం, మే 30 -- Tirupati Govindaraja Swamy Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుపతిలో వెలసిన శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత నయనానందకరంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఎనిమిదో రోజైన శనివారం రథోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. "గోవిందా.. గోవిందా.." అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో తిరుపతి పురవీధులు మార్మోగాయి. వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో, తన్మయత్వంతో స్వామివారి రథాన్ని లాగి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.
ఉదయం 5.40 గంటల శుభ ముహూర్తాన ప్రారంభమైన ఈ రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీ రోడ్డు మీదుగా సాగింది. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు రోడ్ల ఇరుపక్కలా భారీగా నిలిచారు. రథం కదిలిన మార్గమంతా భక్తులు టెంకాయలు కొట్టి, కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారికి మంగళా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.