భారతదేశం, సెప్టెంబర్ 27 -- సస్పెన్స్ కు ఎండ్ కార్డు. దేవర 2 వచ్చేస్తుంది. దేవర మూవీ రిలీజైన ఏడాది పూర్తయిన సందర్భంగా మేకర్స్ బిగ్ అనౌన్స్ మెంట్ చేశారు. దేవర 2 ఉంటుందని ప్రకటించేశారు. ఏడాది తరువాత మేకర్స్ అధికారికంగా సీక్వెల్ ప్రకటించారు. దేవర 2 అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను తమ సీట్ల అంచున వదిలివేసిన గాథను ముందుకు తీసుకువెళుతుంది.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవరలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి దేవర, కొడుకు వరదగా నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా తెలుగు సినిమాలో ప్రముఖ కథకుడిగా కొరటాల స్థానాన్ని బలోపేతం చేసింది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ విలన్ షేడ్స్ ఉన్న రోల్ చేశాడు.

శనివారం (సెప్టెంబర్ 27) దేవర యానివర్సరీ పురస్కరించుకుని నిర్మాణ బృందం సోషల్ మీడియాలో ...