Hyderabad, ఆగస్టు 11 -- జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్.. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు వార్ 2 మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం (ఆగస్టు 10) హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో తారక్ పై హృతిక్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు వన్ టేక్ ఫైనల్ టేక్ యాక్టర్ అని అన్నాడు.

వార్ 2 ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మొదట తెలుగులో మాట్లాడాడు. అందరికీ నమస్కారం.. హైదరాబాద్.. ఎలా ఉన్నారు అని అతడు అనడం విశేషం. ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. తారక్ మీకు అన్న.. నాకు తమ్ముడు అని మరోసారి తెలుగులో చెప్పాడు. టైగర్ ఫ్యాన్స్ అరుపులు ఇంకా గట్టిగా వినిపించాలని అన్నాడు. అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు.

"తారక్ వన్ టేక్ ఫైనల్ టేక్ యాక్టర్. తొలి షా...