భారతదేశం, ఆగస్టు 25 -- హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా వచ్చిన వార్ 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీతో తారక్ బాలీవుడ్ లో అడుగుపెట్టారు. భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైంది. అయితే అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఇది యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్‌లో ఆరవ చిత్రం. 2019 చిత్రం వార్‌కు సీక్వెల్. బాక్స్ ఆఫీస్ వద్ద గ్రాండ్ ఓపెనింగ్ తర్వాత ఈ మూవీ కలెక్షన్లు పడిపోయాయి.

బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్ తర్వాత వార్ 2 కలెక్షన్లు పడిపోయాయి. దీంతో యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనియర్స్ లో అత్యంత తక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా వార్ 2 నిలుస్తుందేమో అనిపించింది. కానీ ఆ చెత్త రికార్డును తారక్ మూవీ తప్పించుకుంది. స్పై యూనివర్స్‌లో అతి తక్కువ వసూళ్లు సాధించిన చిత్రం సల్మాన్ ఖాన్, కత్రినా...