Hyderabad, సెప్టెంబర్ 23 -- ఒక్కో మనిషి వ్యక్తిత్వం, తీరు ఒక్కో విధంగా ఉంటుంది. కొంతమంది చాలా ప్రశాంతంగా ఉంటారు, కొంతమంది ఎక్కువ కోపంతో ఉంటారు, కొంతమంది యాక్టివ్‌గా ఉంటే, కొంత మంది చాలా మౌనంగా ఉంటారు, తక్కువ సమాధానం చెప్తారు. అయితే చాలా మందికి తలపై ఒక సుడి మాత్రమే ఉంటుంది, కొందరికి మాత్రం రెండు సుడులు ఉంటాయి.

ఇలాంటి వారిని చూడగానే చాలా మంది మొదట 'రెండు సుడులు వున్నాయి. రెండు పెళ్లిళ్లు అవుతాయి' అంటారు. చిన్నప్పుడు ఇలా చాలా మంది ఆట పట్టిస్తూ ఉంటారు. అయితే, రెండు సుడులు ఉంటే వారు ఎలా ఉంటారు? రెండు సుడులకు సంబంధించి జ్యోతిష్యులు చెప్పిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా జన్యు శాస్త్రం ప్రకారం చూస్తే తలపై సుడుల సంఖ్య ఆధారంగా ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులకే కానీ, తాత ముత్తాతలకే కానీ రెండు సుడులు ఉన్నట్లయితే అలా రావచ్చు. అయిత...