Hyderabad, జూలై 28 -- తమిళ థ్రిల్లర్ సినిమా ఒకటి రెండేళ్ల తర్వాత తెలుగులో స్ట్రీమింగ్ కు వస్తుండటం విశేషం. ఈ సినిమా పేరు రెడ్ శాండల్ వుడ్ (Red Sandalwood). 2023లో తమిళంలో రిలీజైన ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ గురించి మరిన్ని విశేషాలు ఇక్కడ చూడండి.

తమిళంలో 2023లో రిలీజై ఓ మోస్తరు రెస్పాన్స్ సాధించిన సినిమా రెడ్ శాండల్ వుడ్. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో డబ్ చేసి నేరుగా ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ఈటీవీ విన్ ఓటీటీ ఈ గురువారం (జులై 31) నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని సోమవారం ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"రెడ్ శాండల్ వుడ్.. ఓ బాక్సర్ ప్రమాదకర ప్రపంచంలోకి వెళ్తాడు. అతడు తిరిగి ప్రాణాలతో బయటకు వస్తాడా? జులై 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో మీ ఈటీవీ విన్ ఓటీటీలో.....