Hyderabad, జూలై 12 -- తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రుతి హాసన్. సింగర్‌గా, హీరోయిన్‌గా అలరించిన శ్రుతి హాసన్ ఇటీవల జూలై 11న యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియా షోలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో తన పొడవాటి, అందమైన నల్లటి జుట్టు వెనుక ఉన్న రహస్యం గురించి శ్రుతి హాసన్ వెల్లడించింది.

'శ్రుతి హాసన్ అందమైన జుట్టు వెనుక రహస్యం ఏంటీ?', 'ఇంత ఆరోగ్యకరమైన జుట్టును ఎలా మెయింటైన్ చేస్తారు?' అని హోస్ట్ రణ్‌వీర్ అల్లాబాడియా అడిగాడు. దానికి ఇదంతా ఒక సాధారణ పురాతన ఆయిల్. అది నువ్వుల నూనే అని తన హెయిర్ సీక్రెట్ చెప్పింది శ్రుతి హాసన్.

"ఇది నా నేచురల్ హెయిర్ కలర్. నేను ఆయిల్ వాడుతాను. కానీ, కేవలం నువ్వుల నూనె మాత్రమే వాడతాను. నా మూడ్‌ని బట్టి కొబ్బరికాయ నూనేతో లేదా బాదం నూనేతో కలిపి నువ్వుల ఆయిల్‌ను రాసుకుంటాను....