భారతదేశం, డిసెంబర్ 12 -- బాలీవుడ్‌లో ఈమధ్యే విడుదలైన రణ్‌వీర్ సింగ్ మూవీ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నప్పటికీ.. సోషల్ మీడియాలో, రివ్యూలలో మాత్రం మిశ్రమ స్పందనను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా సినిమాలోని హింస, నిడివిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ నెగటివ్ రివ్యూలను చూసి తాను ఏమాత్రం ఆశ్చర్యపోలేదని నటుడు ఆర్. మాధవన్ అన్నాడు. తన కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్ హిట్స్ అయిన 'రంగ్ దే బసంతి', 'త్రీ ఇడియట్స్' సినిమాలకు కూడా మొదట్లో ఇలాంటి పరిస్థితే ఎదురైందని అతడు గుర్తు చేశాడు.

పూజా తల్వార్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ.. సినిమా విడుదల కాకముందే ఇలాంటి స్పందన వస్తుందని తాను ఊహించానని చెప్పారు.

"సమాజంపై ప్రభావం చూపించే సినిమాలకు ఇలా జరగడం సహజం. మొదట్లో చాలా మంది చెత్త రేటింగ్స్ ఇస్తారు. 'రంగ్ దే బసంతి', 'త్రీ ఇడియట్స్'...