భారతదేశం, ఆగస్టు 5 -- ఓటీటీలోకి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ వస్తూనే ఉంటాయి. థియేటర్లలో అదరగొట్టిన సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తాయా? అని ఆడియన్స్ వెయిట్ చేస్తుంటారు. ముఖ్యంగా తమిళం, మలయాళం, కన్నడ లాంటి భాషల్లో సూపర్ హిట్లుగా నిలిచిన చిత్రాల తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఆత్రుతగా చూస్తారు. ఇప్పుడు అలాంటి ఓ తమిళ సూపర్ హిట్ మూవీ 'పరంతు పో' (Paranthu Po) ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా ఇవాళ (ఆగస్టు 5) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

తమిళ సూపర్ హిట్ ఫ్యామిలీ కామెడీ డ్రామా 'పరంతు పో' మంగళవారం ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సూపర్ హిట్ మూవీ అర్ధరాత్రి నుంచే జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ లాంగ్వేజ్ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది. తెలుగు ఆడియన్స్ ...