భారతదేశం, జూలై 8 -- ఉత్తరప్రదేశ్‌ మొరాదాబాద్‌లోని ఓ రైలులో సంచిలో దొరికిన ఒక నవజాత శిశువు ఒక దారుణమైన నేరాన్ని వెలుగులోకి తెచ్చింది. బిహార్‌కు చెందిన ఒక బాలిక తన తండ్రి చేతిలో అత్యాచారానికి గురైంది. రైలు టాయిలెట్​లో ప్రసవించింది. దానిని కప్పిపుచ్చడానికి కుటుంబం చేసిన ప్రయత్నం తాజాగా అందరిని షాక్​కి గురిచేస్తోంది.

మీడియా కథనాల ప్రకారం తండ్రి అత్యాచారం చేయడంతో గర్భం దాల్చిన తర్వాత.. "చికిత్స కోసం" బాలికను రైలులో దిల్లీకి తీసుకెళ్తున్నప్పుడు.. వారణాసికి సమీపంలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆమె రైలు టాయిలెట్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలిక, కుటుంబ సభ్యులు శిశువును ఒక సంచిలో పెట్టి, దానిని అక్కడే ఉన్న మరొక రైలు టాయిలెట్‌లో పెట్టి దిగిపోయారు.

పట్నా-చండీగఢ్ సమ్మర్ స్పెషల్ రైలు బరేలీ సమీపంలో ఉండగా, కొందరు శిశువు ఏడుపు విన్నారు. అప్పుడే వా...