భారతదేశం, నవంబర్ 10 -- ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం (నవంబర్ 10) సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. పార్కింగ్ చేసిన కారులో శక్తివంతమైన పేలుడు జరగడంతో కనీసం 8 మంది మరణించారు. 24 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. వీళ్లను హాస్పిటల్ కు తరలించగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ పేలుడు కారణంగా పక్కనే ఉన్న అనేక వాహనాలకు మంటలు అంటుకున్నాయి.
లాల్ ఖిలా (Lal Quila) మెట్రో స్టేషన్ గేట్ నెం. 1 సమీపంలో జరిగిన ఈ పేలుడు తీవ్రతకు కొన్ని మీటర్ల దూరంలో ఉన్న వాహనాల అద్దాలు కూడా పగిలిపోయాయి. సమీప భవనాలకు కూడా పేలుడు శబ్దం గట్టిగా వినిపించింది.
ఢిల్లీ అగ్నిమాపక సేవల ప్రకారం ఈ పేలుడుతో మూడు నుంచి నాలుగు వాహనాల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే ఏడు ఫైర్ టెండర్లను ఘటనా స్థలానికి పంపారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.