భారతదేశం, ఆగస్టు 18 -- రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి కుళ్లిపోయిన మృతదేహం, అతని ఇంటిపైన నీలి రంగు డ్రమ్​లో కనిపించింది. ఇంట్లో అతని భార్య, పిల్లలు అదృశ్యమయ్యారు. ఇది ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లో, కొన్ని నెలల క్రితం జరిగిన సౌరభ్​ రాజ్​పుట్​ హత్య కేసును గుర్తు చేసింది. అక్కడ ఆ వ్యక్తిని డ్రమ్‌లో పూడ్చిపెట్టిన విషయం తెలిసిందే.

ఈ ఘటన ఆల్వార్‌లోని తిజారా జిల్లా, ఆదర్శ్ కాలనీలో చోటుచేసుకుంది. బాధితుడు నివాసం ఉంటున్న ఆ ఇంటి యజమానురాలు.. ఏదో పని మీద మొదటి అంతస్తుకు వెళ్లగా, అక్కడ నుంచి తీవ్రమైన దుర్వాసన వచ్చింది. వెంటనే వెనక్కి తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఆమె పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా, దుర్వాసన వస్తున్న గదిలోని డ్రమ్‌లో మృతదేహం కనిపించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు ఉ...