భారతదేశం, ఫిబ్రవరి 7 -- ఒక్క హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు హీరో విష్వక్ సేన్. దాస్ కా దమ్కీ, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ, లైలా.. ఇలా వరుసగా సినిమాలు చేసినా అనుకున్న హిట్ మాత్రం దక్కలేదు. ఇప్పుడు ఓ హిట్ కోసం రూట్ మార్చి కామెడీ ఎంటర్ టైనర్ 'ఫంకీ' మూవీ చేశాడు విష్వక్. ఈ రోజు (ఫిబ్రవరి 7) రిలీజైన ఈ మూవీ ట్రైలర్ కడుపుబ్బా నవ్విస్తోంది.

జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన డైరెక్టర్ అనుదీప్ తెరకెక్కించిన మూవీ 'ఫంకీ'. ఇందులో విష్వక్ సేన్, కాయదు లోహర్ హీరో హీరోయిన్లు. ఈ సినిమా ట్రైలర్ ను శనివారం రిలీజ్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పంచ్ లతో ట్రైలర్ అదిరిపోయింది. దీన్ని బట్టి చూస్తే సినిమాను మరోసారి అనుదీప్ తన స్టైల్లో కామెడీ మూవీగా రెడీ చేశాడని అర్థమవుతోంది.

ఫంకీ ట్రైలర్ పేరుకు తగ్గట్లే ఫన్నీగా, పూర్త...