భారతదేశం, సెప్టెంబర్ 27 -- ఓ వైపు రంగస్థలం, పుష్ప లాంటి భారీ హిట్లతో ఇండస్ట్రీని షేక్ చేయడంతో పాటు మరోవైపు కొత్త దర్శకులను పరిచయం చేస్తూ సాగిపోతున్నారు టాప్ డైరెక్టర్ సుకుమార్. భారీ సినిమాలు చేస్తూనే తన శిష్యులను ప్రోత్సహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తో ఎంతో మంది యంగ్ అండ్ టాలెంటెడ్ అప్ కమింగ్ డైరెక్టర్లను సానబెడుతున్నారు. ఆయన శిష్యుల్లో చాలా మంది ఇప్పటికే డైరెక్టెర్లుగా మారారు. ఇప్పుడు అదే వరుసలో మరో శిష్యుడు డైరెక్టర్ కాబోతున్నాడు.

టాలీవుడ్ లో డైరెక్టర్లుగా మారిన సుకుమార్ శిష్యులకు ఓ స్పెషాలిటీ ఉంది. సుకుమార్ దగ్గర పని నేర్చుకున్న వాళ్ల మెగా ఫోన్ పట్టి హిట్లు కొడుతున్నారు. నానితో దసరా లాంటి మాస్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల, వైష్ణవ్ తేజ్ తో ఉప్పెనతో సంచలన నమోదు చేసిన బుచ్చిబాబు సానా, కుమారి 21 ఎఫ్ అంటూ ట్రెండ్ సెట్ చేస...