భారతదేశం, అక్టోబర్ 31 -- డీప్ ఫేక్ టెక్నాలజీ బారిన పడిన పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు దానికి వ్యతిరేకంగా గళమెత్తాడు. దీనిని కట్టడి చేయడానికి కఠిన చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నాడు. వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఏక్తా దివస్ ర్యాలీలో చిరు పాల్గొన్నాడు. అతడు ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉండటం విశేషం.

మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన ఏక్తా దివస్ 2కే రన్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా డీప్ ఫేక్ టెక్నాలజీ, ఏఐని దుర్వినియోగం చేస్తుండటంపై చిరు మాట్లాడాడు. సైబర్ నేరాలను కట్టడి చేయడానికి పోలీసులు తీసుకుంటున్న చర్యలను కొనియాడాడు. అయితే డీప్ ఫేక్ ఓ గొడ్డలి పెట్టులాంటిదని, దీనికి చెక్ పెట్టడానికి కఠిన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని చిరంజీవి స్పష్టం చేశాడు.

టెక్నాలజీ మన జీవితాలను హాయ...