భారతదేశం, ఫిబ్రవరి 27 -- ఏపీలో పరువు హత్య కలకలం రేపుతోంది. చెల్లెలు కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో ఆమె భర్తను అన్నలు రాళ్లతో కొట్టి దారుణంగా చంపేశారు. వెంబడించి మరీ కిరాతకంగా హతమార్చారు. ఉదయం పెళ్లిచేసుకోగా.. రాత్రివరకు చెల్లెలి భర్తను కొట్టి చంపేశారు. పూర్తి వివరాల్లోకి వెల్తే..

కోనసీమ జిల్లా మండపేట మండలం వేములపల్లి గ్రామంలో ఒక యువకుడిని రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన బయటకు వచ్చింది. మృతుడు సూర్యప్రకాష్‌గా గుర్తించారు. అన్నవరం ఆలయంలో సంధ్య అనే మహిళను వివాహం చేసుకున్నాడు. మహిళ కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ఈ వివాహం జరిగింది. ఇదే పరువు హత్యకు కారణమైంది.

పోలీసుల ప్రాథమిక నివేదిక ప్రకారం, సంధ్య ప్రస్తుతం రాయవరంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. ద్వారపూడికి చెందిన సూర్యప్రకాశ్ రావు బట్టల వ్యాపారం చేస్తుంటారు. కొంతకాల...