భారతదేశం, ఆగస్టు 6 -- డార్లింగ్ ప్రభాస్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'ది రాజాసాబ్'. ఇటీవల రిలీజైన ఈ మూవీ ట్రైలర్ లో ప్రభాస్ అదిరిపోయాడు. అతని వింటేజీ లుక్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. దీంతో ఈ మూవీ రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ డార్లింగ్ ఫ్యాన్స్ కు షాక్ తగిలేలా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ కామెంట్లున్నాయి. నిజానికి ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉంది.

ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజాసాబ్' 2022 నుంచి నిర్మాణంలోనే ఉంది. వీఎఫ్ఎక్స్ కారణంగా రిలీజ్ లేట్ అయిందని ప్రొడ్యూసర్లు ఇప్పటికే చెప్పారు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదలను సంక్రాంతికి మార్చే అవకాశం ఉందని గ్రేట్ ఆంధ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.

రాజా సాబ్ రిలీజ్ సంక...