భారతదేశం, సెప్టెంబర్ 17 -- ఆచార్య చాణక్యుని నీతి శాస్త్రం కేవలం శ్లోకాలతో కూడుకున్నది మాత్రమే కాదు.. మనిషి దైనందిన జీవితాన్ని సరిదిద్దే గొప్ప జీవన గ్రంథం. ఇందులో చెప్పిన ప్రతీ అంశం నేటి ఆధునిక జీవితానికి కూడా సరిగ్గా సరిపోతుంది. ముఖ్యంగా ఎన్ని సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదని బాధపడేవారికి చాణక్య నీతిలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. జీతం రాగానే ఖర్చయిపోవడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడటానికి మన రోజూవారీ అలవాట్లే కారణం కావచ్చని చాణక్యుడు హెచ్చరిస్తున్నారు.

ఉదయం లేచిన వెంటనే ఇళ్లలో గొడవలు పడటం లేదా చిరాకు పడటం వల్ల రోజంతా ప్రతికూల ప్రభావం పడుతుంది. సాధారణంగా ఎవరైతే ఆలస్యంగా నిద్రలేస్తారో వారిలో తెలియని అసహనం, ఒత్తిడి పెరుగుతాయి. ఇది ఇంటి వాతావరణాన్ని పాడుచేస్తుంది.

చాణక్య నీతి ప్రకారం కోపం, బద్ధకం మనిషికి అతిపెద్ద శత్రువులు. ఉదయాన్నే త్...