భారతదేశం, అక్టోబర్ 1 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి మార్పు మానవ జీవితాలపై, దేశ విదేశాల పరిస్థితులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా సంపద, ఐశ్వర్యం, ఆకర్షణ మరియు విలాసాలకుకారకుడైన శుక్ర గ్రహం తన స్వక్షేత్రమైన తులారాశిలోకి ప్రవేశించబోతుండటం ప్రస్తుత కాలంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే అక్టోబర్ 20వ తేదీన జరగనున్న ఈ రాశి మార్పు కేవలం సాధారణ గోచారమే కాదు, అద్భుతమైన రాజయోగాలకు దారి తీస్తుంది.

తులారాశిలో ఇప్పటికే బుధుడు సంచరిస్తుండటం వల్ల తొలుత 'లక్ష్మీనారాయణ రాజయోగం' ఏర్పడుతుంది. ఆ తర్వాత శుక్రుడు స్వయంగా తన సొంత రాశిలోకి (స్వక్షేత్రం) అడుగుపెట్టడం ద్వారా అత్యంత శక్తివంతమైన 'మాలవ్య రాజయోగం' రూపుదిద్దుకుంటోంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం, శుక్రుడు తన స్వంత రాశిలో లేదా ఉచ్ఛ రాశిలో లగ్నానికి 1, 4, 7 లేదా 10వ స్థానాల్లో (కే...