భారతదేశం, జనవరి 4 -- బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు. ఈ మూవీ 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ ను ఆదివారం (జనవరి 4) రిలీజ్ చేశారు. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్లతో ఇది ఫుల్ ఎంటర్ టైనర్ లా ఉంది. ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న మూవీ మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ ఇవాళ రిలీజైంది. ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ తళుక్కుమని మెరిశారు. ఈ ట్రైలర్ పాజిటివ్ రియాక్షన్స్ వస్తున్నాయి.

తిరుపతిలో జరిగిన మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ''తిరుపతి అంటే నాకు చాలా స్పెషల్. ఏ సినిమా మొదలెట్టినా, రిలీజ్ ఉన్నా ఇక్కడికి వచ్చి ...