భారతదేశం, ఆగస్టు 19 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 676 పాయింట్లు పెరిగి 81,274 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 251 పాయింట్లు వృద్ధిచెంది 24,882 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 415 పాయింట్లు పెరిగి 55,757 వద్దకు చేరింది.

రష్యా- ఉక్రెయిన్​ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చేస్తున్న ప్రయత్నాలు, భారత్​పై విధించిన అదనపు సుంకాలను తొలగించే అవకాశం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు, దేశీయంగా జీఎస్టీ సంస్కరణల వార్తలు స్టాక్​ మార్కెట్​లో జోష్​ని నింపాయి.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 403.16 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4239.73 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన...